Monday, April 29, 2024

Shadnagar – నెంబర్ ప్లేట్, లైసెన్స్ లేని వాహనాలు సీజ్

షాద్ నగర్ ఆగస్టు 17 ప్రభన్యూస్ శంషాబాద్ డీసీపీ ఆదేశానుసారం షాద్ నగర్ పట్టణంలో స్థానిక సీఐ ప్రతాప్ లింగం పర్యవేక్షణలో పలుచోట్ల ద్విచక్ర వాహనాల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేశంపెట్ రోడ్ , దూసకల్ x రోడ్, హజిపల్లీ రోడ్, లింగారెడ్డి గూడ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగిందని ఎస్సై శరత్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా 06 నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలను సీజ్ చెయ్యడం జరిగింది…హెల్మెట్ లేని వాహనదారులకు చలాన్స్ వేయటం జరిగిందని పేర్కొన్నారు.

నిబంధనలు పాటించకుండా ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, హెల్మెంట్ పెట్టుకోకపోవడం లైసెన్సులు లేకపోవడం లాంటి చర్యలతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని సిఐ ప్రతాప్ లింగం మీడియాకు తెలిపారు. రోడ్లపై ఈస్టర్ రాజ్యాంగ ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించి వాహనాలు నడిపితే చట్టరీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement