Thursday, May 2, 2024

YS Sharmila Conditions – ఆ ఐదు ఇస్తే…విలీనం ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సెగ్మెంట్లు- ఇవ్వాలన్న డిమాండ్‌ను వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ చీఫ్‌, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనయ షర్మిల ఆ పార్టీ హైకమాండ్‌ ముందుంచిందా? అలా అయితేనే విలీన ప్రక్రియకు సై చెబుతానని షర్మిల షరతు పెట్టిందా? అంటే అవుననే అంటు-న్నారు ఇరు పార్టీల నేతలు. తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి కన్న కలలను నిజం చేయాలన్న ఉద్దేశంతో షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీని ఏర్పాటు- చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటు-న్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమె సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న షర్మిల మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ షర్మిలతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. భర్త అనిల్‌, పార్టీ ముఖ్యలతో సుదీర్ఘ మంతనాల అనంతరం షర్మిల వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు పలు దఫాలు ఢిల్లీ వెళ్లిన బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పెద్దలతోనూ వరుస భేటీ-లు నిర్వహించి విలీన ప్రక్రియ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పాత్రపై చర్చినట్టు- వార్తలొచ్చాయి. నాలుగు రోజుల క్రితం షర్మిల, అనిల్‌లు హస్తిన వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యులతో సమావేశమై విలీన ప్రక్రియ ముహుర్తాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన షర్మిల అంతకుముందు డీకే శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమై సమాలోచనలు జరిపినట్టు- సమాచారం. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్న విషయాన్ని షర్మిల పార్టీ సీనియర్లతో సమావేశమై చెప్పి వారి అభిప్రాయాలను సేకరించినట్టు- తెలుస్తోంది. వరుసగా రెండు రోజులపాటు- ఆమె ఇక్కడి లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో నేతలను కలుస్తూ వారితో చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో మరో దఫా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశం కావాలని నిర్ణయించినట్టు- సమాచారం. పార్టీ విలీనం తర్వాత జరగనున్న పరిణామాలను అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ఇచ్చే సీట్ల విషయంలో స్పష్టతకు రావాలని భావిస్తున్నట్టు- సమాచారం.

ఐదు అసెంబ్లీ సీట్లు- కోరుతున్న షర్మిల?
మరో నాలుగైదు నెలల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఐదు అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే సీట్ల సర్దుబాటు- విషయంలో ఎటూ తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ పీసీసీ కొట్టు- మిట్టాడుతోంది. తాజాగా షర్మిల ఎంట్రీ- ఇవ్వడంతో ఏం చేయాలో తెలియక తలపట్టు-కుంటున్నట్టు- సమాచారం. ఒక వైపు డీకే శివకుమార్‌ పట్టుబట్టి షర్మిల పార్టీని విలీనం చేసే దిశగా చర్యలు చెప్పట్టారని, ఇప్పుడు ఈ విషయంలో వెనక్కు తగ్గినా ప్రక్రియను వ్యతిరేకించినా వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఉండదన్న ఆందోళన పీసీసీ నేతల్లో వ్యక్తమవుతున్నట్టు- సమాచారం.
కాగా షర్మిల కోరుతున్నట్టు- ఐదు అసెంబ్లీ స్థానాలివ్వడానికి రాష్ట్ర కాంగ్రెస్‌ సిద్ధంగా లేదన్న సంకేతాలను పార్టీ ముఖ్యనేతలు డీకే శివకుమార్‌కు పంపించినట్లు- సమాచారం. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా డోర్నకల్‌, ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి లేదా నకిరేకల్‌, సికింద్రాబాద్‌ స్థానాలను షర్మిల కోరుతున్నట్టు- చెబుతున్నారు. పాలేరు నుంచి తాను పోటీ- చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించడంతో పాటు- అక్కడ పార్టీ కార్యాలయాన్ని, నివాసాన్ని ఏర్పాటు- చేసుకున్నారు. షర్మిల అనుచరుడు ఏపూరు సోమన్న తుంగతుర్తి నుంచి పోటీ-కి సిద్ధమయ్యారు. మహబూబాబాద్‌ అసెంబ్లీ నుంచి సుజాతను బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు- సమాచారం. ఐదు సీట్లు- కోరుతున్న షర్మిలకు నచ్చజెప్పి రెండు స్థానాలను ఇవ్వాలన్న ప్రతిపాదన కాంగ్రెస్‌ పెద్దల్లో ఉన్నట్టు- చెబుతున్నారు. అప్పటికీ ఆమె మరో సీటు- కోసం పట్టు-బడితే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు- సమాచారం. ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న షర్మిల అక్కడే పార్టీ పెద్దలను కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవాలని ప్రతిపాదించారని ఆమె సన్నిహిత నేతలు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement