Saturday, April 20, 2024

TS | 2.5 లక్షల నగదు పట్టివేత.. ఆధారాలు లేకపోవడంతో సీజ్!​

అశ్వారావుపేట, (ప్రభ న్యూస్): సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రెండున్నర లక్షల రూపాయల నగదును అశ్వరావుపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎటపాక మండలం రాజుపేట గ్రామానికి చెందిన శిలం శ్రీనివాస్ దేవరపల్లి నుండి 2.5 లక్షల రూపాయల నగదును కారులో తీసుకుని వస్తుండగా స్థానిక సరిహద్దు చెక్​పోస్టు పట్టుకున్నారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలలో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement