Friday, May 3, 2024

TS: నేటి నుంచి గులాబీ ద‌ళ‌ప‌తి బ‌స్సు యాత్ర… షెడ్యూల్ ఇదే

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్ నేటి నుంచి ఎన్నిక‌ల ప్ర‌చార యాత్ర‌కు బ‌య‌లు దేర‌నున్నారు.. పోరుబాట పేరుతో బిఆర్ఎస్ పార్టీ నిర్వ‌హిస్తున్న ఈ   రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. 

- Advertisement -

మిర్యాలగూడలో ప్రారంభమైన యాత్ర సిద్దిపేటలో బహిరంగ సభతో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ ఉంది. అయితే సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

ఇక  కేసీఆర్ యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు వాహన శ్రేణి ఫాలో కానుంది. ఇప్పటికే ఎంపికైన వారికి   తెలంగాణ భవన్‌లో అవగాహన కల్పించారు. కాగా,  తొలిరోజైన బుధవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.  పార్టీ క్యాడర్, నేతలతో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తొలిరోడ్డు షోలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లనున్నారు.. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు . దీంతో ప్రజలు పెద్దఎత్తున నిలబడి ప్రసంగాన్ని దూరం నుంచి వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కెసిఆర్ టూర్ షెడ్యూల్…1వ రోజు 24-04-20241. మిర్యాల గూడ రోడ్ షో – సాయంత్రం  05.30  2. సూర్యాపేట రోడ్ షో – 07.00   సూర్యాపేట‌లో (రాత్రి బస)2వ రోజు 25-04-2024భువనగిరి  రోడ్ షో – సాయంత్రం 06.00  (రాత్రి బస) ఎర్రవల్లిలో3వ రోజు 26 -04-2024మహబూబ్ నగర్ లో రోడ్ షో – సాయంత్రం  06.00  మహబూబ్ నగర్ (రాత్రి బస)4వ రోజు 27-04-2024నాగర్ కర్నూల్ రోడ్ షో – సాయంత్రం 06.00  5వ రోజు 28-04-2024వరంగల్ రోడ్ షో  – సాయంత్రం 06.00  వరంగల్ (రాత్రి బస)6వ రోజు 29-04-2024ఖమ్మం రోడ్ షో -సాయంత్రం  06.00  ఖ‌మ్మంలో  (రాత్రి బస)7వ రోజు 30-04-20241. తల్లాడ లో రోడ్ షో – సాయంత్రం 05.30  2. కొత్తగూడెం లో రోడ్ షో -సాయంత్రం  06.30  కొత్తగూడెంలో (రాత్రిబస)8వ రోజు 01-05-2024మహబూబాబాద్ రోడ్ షో –సాయంత్రం 06.00  వరంగల్ లో (రాత్రి బస)9వ రోజు 02-05-2024జమ్మికుంట రోడ్ షో – సాయంత్రం 06.00  వీణవంకలో (రాత్రి బస)10వ రోజు 03-05-2024రామగుండం రోడ్ షో –  సాయంత్రం 06.00  రామగుండంలో రాత్రిబస11వ రోజు 04-05-2024మంచిర్యాల రోడ్ షో –సాయంత్రం  06.00  కరీంనగర్ లో (రాత్రి బస)12వ రోజు 05-05-2024జగిత్యాల రోడ్ షో –సాయంత్రం 06.00  జగిత్యాలలో (రాత్రి బస)13వ రోజు 06-05-2024నిజామాబాద్ రోడ్ షో – సాయంత్రం 06.00  నిజామాబాద్ లో (రాత్రి బస)14వ రోజు 07-05-20241. కామారెడ్డి రోడ్ షో –సాయంత్రం  05.30  2. మెదక్ రోడ్ షో – రాత్రి  7.00  మెదక్ లో (రాత్రి బస)15వ రోజు 08-05-20241. నర్సాపూర్ రోడ్ షో – సాయంత్రం 05.30 2. పటాన్ చెరువు రోడ్ షో – రాత్రి  07.00  ఎర్రవెల్లి లో (రాత్రి బస)16వ రోజు 09-05-2024కరీంనగర్ రోడ్ షో – సాయంత్రం 06.00  కరీంనగర్ లో (రాత్రి బస)17వ రోజు 10-05-20241. సిరిసిల్ల రోడ్ షో – సాయంత్రం 05.00  2. సిద్దిపేట బహిరంగ సభ –సాయంత్రం  06.30

Advertisement

తాజా వార్తలు

Advertisement