Sunday, April 28, 2024

Road accident: రోడ్డు ప్ర‌మాదంలో రౌడీషీటర్ దుర్మరణం

చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కాచిగూడకి చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ మృతి చెందాడు. సవేరా హోటల్ సమీపంలో అతివేగంగా వచ్చి లారీని ఢీకొట్టి చక్రాల కింద పడి మరణించాడు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న చాదర్ ఘాట్ పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. కాచిగూడ నివాసి శ్రీకాంత్ సింగ్ స్థానిక కాచిగూడ రౌడీ షీటర్.. ఇతనిపై సుల్తాన్ బజార్, లేక్ పోలీస్ స్టేషన్, చైతన్యపురి పీఎస్‌లలో కేసులు ఉన్నాయి. శ్రీకాంత్ ఒళ్ళంతా పచ్చ బొట్లు వేయించుకున్నాడు. ఇతనికి సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు.. రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈరోజు లారీ చక్రాల కింద పడి చనిపోయాడు. మృతుని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement