Friday, May 3, 2024

Karimnagar – బీఆర్ఎస్ కార్పోరేటర్ జంగిలి సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్

కరీంనగర్ – బీఆర్ఎస్ కార్పోరేటర్ జంగిలి సాగర్ పై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు కరీంనగర్ రూరల్ పోలీసులు ప్రకటించారు. రిటైర్డ్ టీచర్ కు చెందిన భూమిని సేఫ్ గా ఉంచాలంటే రూ. 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సాగర్ ఆ రహదారి మధ్యలోంచి రోడ్డును కూడా వేయించాడు. దీంతో సదరు భూమి యజమాని సాగర్ తో రాజీ కుదుర్చుకునేందుకు తలొగ్గాల్సి వచ్చింది. ఈ క్రమంలో సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుని నుండి రూ. 10 లక్షలకు ఒప్పందం కాగా అందులో రూ. 2 లక్షలు అతని కూతురు అకౌంట్ కు బదిలీ చేసిన బాధితుడు మిగతా రూ. 8 లక్షలు నేరుగా ఇచ్చానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాగర్ డబ్బు డిమాండ్ చేసినప్పటి వీడియో కూడా పోలీసులకు బాధితుడు అందజేశారు. ఈ క్రమంలో సాగర్ ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొన్న సాగర్ పై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.

పోలీస్ మాన్యూవల్ నెం.600-1 ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కర్ణాకర్ రావు తెలిపారు. సాగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుల్లో ఒకరు. కార్పొరేటర్ల అరెస్టుల పర్వం కొనసాగుతుండగా సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేయడం కలకలం రేపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement