Friday, May 3, 2024

హుజురాబాద్ సెగ : కారు గుర్తుకు ‘రొట్టెల పీట’ తలనొప్పి

హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. తొలి రెండు రౌండ్లలోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. అయితే, కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ గుర్తు వలన తమకు నష్టం జరిగిందని టీఆరెస్ శ్రేణులు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో వాపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ విషయం మరోసారి వార్తల్లోకి వస్తోంది.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికలో చపాతీ రోలర్ గుర్తుపై ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు. ఆయన మొదటి రౌండ్లో 122 కోట్లు సాధించి ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తున్నారు. రెండో రౌండ్ లో రోటి మేకర్ కు 158 ఓట్లు వచ్చాయి. దీంతో కౌంటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు ఎన్ని ఓట్లు పొందుతారో అని టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement