Saturday, June 15, 2024

Road Terror – నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు దుర్మరణం

నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మండలంలోని నల్లగట్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు అశోక్, ఆంజనేయులు, అనిరుధ్, నర్సమ్మగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement