Monday, October 18, 2021

ఎస్సారెస్పీ కెనాల్ ప‌డిన కారు – ముగ్గురు గ‌ల్లంతు..

వరంగల్‌ : వేగంగా దూసుకువస్తున్న కారు ఎస్సారెస్పీ కెనాల్‌ పడిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్‌లో పడడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు కాపాడగా.. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. అందులో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. కారును కెనాల్‌ నుంచి బయటకు తీశారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News