Friday, May 3, 2024

TS CM: రేవంత్‌రెడ్డి సీఎం ప్రమాణస్వీకారం సమయంలో మార్పు..

రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం గురువారం ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఆయన రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ సమయంలో మార్పులు చేశారు.

గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. నూతన సీఎం ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఎల్బీస్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి, డీజేపీ, పోలీస్ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు ఎల్బీ స్టేడియానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement