Tuesday, May 21, 2024

Revange – అత్తాపూర్ లో దారుణ హత్య

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఖలీల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఖలీల్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అత్తాపూర్ లో అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయి.. చింతల్ మెట్ వద్ద ఖలీల్ ఉల్లా అనే యువకుడి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వివరించారు. కత్తులతో పొడిచి అతి దారుణం గా చంపేసినట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు

కాగా హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కు ఖలీల్ మధ్య గత కొంత కాలంగా గొడవలున్నాయి. ఈ గొడవల కారణంగానే ఖలీల్ ను ఉస్మాన్ చంపేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖలీల్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement