Wednesday, October 16, 2024

Resigned – ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌కు ముగ్గురు బిఆర్ఎస్ నేతలు రాజీనామా….

హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామాలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు నేడు రాజీనామా చేశారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ ఛాంబర్‌లో కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కారణంగా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement