Monday, May 6, 2024

కాళేశ్వరంలో రెడ్ అలర్ట్.. గంట గంటకు పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

మహాదేవపూర్ (ప్రభన్యూస్): ప్రాణహిత, గోదావరి ఉప్పొంగడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. బుధవారం కాలేశ్వరం పుష్కరఘాట్ వద్ద 15 మీటర్లకు పైగా గోదావరి నీటి మట్టం పెరగడంతో నదీ తీర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. అప్రమత్తమైన అధికారులు కాళేశ్వరంలో రెడ్ అలర్ట్ ప్రకటించి బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

కాలేశ్వరం ప్రాజెక్టు లోని లక్ష్మి బ్యారేజ్ (మేడిగడ్డ) కు సాయంత్రం 6 గంటల వరకు 16,71,390 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 85 గేట్లు ఎత్తి 16,71,390 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement