Friday, April 26, 2024

పత్తికి రికార్డు ధర.. క్వింటాకు రూ. 11,170

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తెల్లబంగారం వరంగల్‌ ఏనుుమాముల మార్కెట్‌లో రికార్డు ధరను నమోదు చేసింది. ఇప్పటివరకు పత్తిలో 10,100 రూపాయల వరకు గరిష్ట ధర నమోదు అయింది. శుక్రవారం రికార్డుస్థాయిలో క్వింటాకు 11,170 రూపాయల ధర పలికింది. తెల్లబంగారానికి ఈ ఏడాది ఇదే గరిష్ట ధరగా రికార్డుకు ఎ క్కింది. జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బక్కం వెంకటయ్య అనే రైతు 21 బస్తాల పత్తిని వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. గణపతి సాయి ట్రేడర్స్‌కు సంబంధించిన వ్యాపారి 11,170 రూపాయల గరిష్ట ధరను చెల్లించి వెంకటయ్యకు సంబంధించిన 21 బస్తాల పత్తిని కొనుగోలు చేశారు.

మునుపెన్నడూలేని విధంగా క్వింటా పత్తికి 11,170 రూపాయల ధర రావడం పట్ల బక్కం వెం కటయ్య సంతోషం వ్యక్తం చేశారు. పత్తి సీజన్‌ దాదాపుగా ముగిసింది. నీటి ఆధారంతో సాగుచేసిన పత్తి కూడా చివరి దశకు చేరింది. ఈ దశలో మార్కెట్‌లో కూడా రికార్డు స్థాయి ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులవద్ద పత్తి నిలువలు అయిపోగా వ్యాపారుల వద్దనే పత్తి నిలువలు ఎక్కువగా ఉన్నాయి. మూడు, నాలుగు మాసాల ముందు ఈ రకమైన ధరలు వచ్చినట్లయితే రైతులకు మరింత లాభసాటిగా ఉండేదని పత్తి రైతులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement