Sunday, May 5, 2024

ఐవీఎఫ్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం : హాజరైన మంత్రి సబితారెడ్డి

ప్రపంచ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆర్ కె పురం కిన్నెర గ్రాండ్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ ఘాట్, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల‌ శ్రీనివాస్ గుప్తా, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…మహిలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేద వైశ్యులకు అండగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలువటం అభినందనీయమన్నారు. నేల నుండి ఆకాశయానంలో విమానాలు నడిపే వరకు మహిళలు దూసుకుపోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. నేడు మహిళలు ధైర్యంగా బయట తిరగాటనికి షీ టీమ్ లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఅర్ కు దక్కుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు నామినేటెడ్ పదవుల్లో, పోలీస్ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సబితారెడ్డి పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళ‌లందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement