Sunday, May 5, 2024

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు..

యాచారం : మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో, యాచారం మండల కేంద్రంలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఎంపిపి కొప్పు సుకన్య భాషా, పిఎసిఎస్‌ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అనుకూలంగా ఉండేందుకు, అందుబాటులో ఉండేందుకు వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులందరు దళారులకు ఎవరికి ధాన్యాన్ని ఇవ్వకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరు మీ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే తమ పంటలను అమ్ముకోవాలన్నారు. రైతులందరికి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తుందని.. దళారుల మాటలు నమ్మి ఎవరు కూడ మోసపోవద్దని చెప్పారు. తమ పంటను తక్కువ ధరలకు అమ్ముకోకూడదని వారు సూచించారు. అదే విధంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుందని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, చింతపట్ల గ్రామ సర్పంచ్‌ సరితా, వ్యవసాయాధికారి సందీప్‌, ప్రశాంతి, జోగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement