Friday, May 3, 2024

బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు… గంట‌కు పైగా ట్రాఫిక్ జామ్..

  • బుచ్చి గూడ వద్ద విద్యార్థుల ఆందోళన..
  • సీఎం రావాలంటూ విద్యార్థుల నినాదాలు
  • పాఠశాలలకు ఎలా వెళ్లాలి అంటూ విద్యార్థుల నిలదీత
  • షాద్ నగర్ ఆర్టీసీ డిపో అధికారుల తీరుపై నిరసన

రంగారెడ్డి: ఉదయం వేళ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కనీస బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కోవిడ్ సీజన్ నుండి నేటి వరకు బస్సుల రాకపోకల్లో షాద్ నగర్ డిపో అధికారులు మార్పులు చేశారు. చాలా బస్సులను రద్దు చేశారు. దీంతో ఉదయం పూట ఒకే బస్సు ఈ రూట్ లో ఉండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉండడంతో బస్సు సరిపోకపోవడం అనేక సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంతో చివరికి విసిగి వేసారిన విద్యార్థులు అందరూ ఏకమై బుచ్చిగూడ, వెలిజర్ల మధ్య బస్సులు ఆపి గంటకు పైగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. సీఎం రావాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డిపో అధికారులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం బుచ్చి గూడ వద్ద ఈ సంఘటన నెలకొంది. షాద్ నగర్ నుండి కొత్తపేట రూట్ లో బస్సు కోసం విద్యార్థులు పరితపిస్తున్నారు.

చాలా కాలంగా పాఠశాలలకు సరైన సమయంలో వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఎంతో కాలంగా విసిగి వేసారి విద్యార్థులు బస్సులు అడ్డగించి బైఠాయించారు. సీఎం రావాలి ఆర్టీసీ అధికారులు డౌన్ డౌన్, ప్రజా ప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ అక్కడ నినాదాలు చేశారు. గతంలో కొత్తపేట రూట్లో బైరఖాన్ పల్లి, సంగేమ్ సెటిల్, కొత్తపేట, కడ్తాల రూట్లకు సంబంధించి బస్సుల సౌకర్యం ఉండేది. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ రూట్లో బస్సులు అన్నీ నిలిపివేశారు. దీంతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉదయం విద్యార్థులు బస్సులు నిలిపి దాని ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే సీఎం రావాలి తమకు హామీ ఇవ్వాలి అంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఎవరు సర్ది చెప్పిన వినడం లేదు. కొత్త పేట్ నుండి షాద్ నగర్ ఉదయం 8:00 లకు రావాల్సిన బస్సులో 40 మంది ప‌ట్టాల్సిన బస్ లో 150 మందిని ఎక్కించుకుని బస్ పోనించారు. మిగిలిన మరికొంతమంది విద్యార్థులు రోడ్డుపై వదిలేశారు దీంతో విద్యార్థులు ధర్నాకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement