Saturday, May 11, 2024

Rangareddy: న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి సబితారెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి)… తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో మీర్ పేట్ కార్పొరేషన్ లోని జిల్లెలగూడ ఎస్ వై ఆర్ కన్వెన్షన్ లో తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి హాజరై న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. గర్భిణీ మహిళల్లో రక్త హీనత సమస్యను అధిగమించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్ల కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ప్రారంభించి, మహిళలకు అందించారు.

ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆశ, ఏఎన్ఎం లకు చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, కలెక్టర్ హరీష్, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, ఆర్డీవో సూరజ్ కుమార్, జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు, తహశీల్దార్ జనార్దన్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement