Friday, September 13, 2024

RR: జోడో యాత్రకు ఏడాది పూర్తి.. ఆమనగల్లులో కాంగ్రెస్ భారీ ర్యాలీ

ఆమనగల్లు, సెప్టెంబర్ 7, ప్రభన్యూస్ : కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడొ యాత్రకు ఏడాది పూర్తయిన సందర్భంగా కల్వకుర్తి కాంగ్రెస్ నేత సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నేతృత్వంలో ఆమనగల్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంగ్లీ రాములు, పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్యల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలు తండాలతో పాటు ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు చెందిన కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆమనగల్లు పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేత, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రజలకు మరింతదగ్గర చేసిందన్నారు.

రాబోవు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరించి తెలంగాణతో పాటు కేంద్రంలో అధికారంలోకి తేవడం ఖాయమని ఉద్ఘాటించారు. కాగా సుంకిరెడ్డి రాకతో కల్వకుర్తిలో కాంగ్రెస్ కు పూర్వవైభవం చేకూరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు చేరువవుతున్నారని సుంకిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రచ్చ శ్రీరాములు, పులికంటి మైసయ్య, ఎంగలి ప్రసాద్, పోలెపల్లి శ్రీనివాస్ రెడ్డి , ఖాదర్, అలీమ్, రాజు, ఖలీమ్, వస్పుల శ్రీకాంత్, బొబ్బిలి, రాఘవేందర్, కరీమ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement