Friday, May 3, 2024

భారీ వర్షాల ఎఫెక్ట్ : వికారాబాద్ కు నిలిచిపోయిన రాకపోకలు

వికారాబాద్ టౌన్, జులై 20 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్ర ప్రాంతంలో భారీ వర్షాలు రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కుండ పోత వర్షాలు కురుస్తుండడంతో గురువారం మధ్యాహ్నం వికారాబాద్ కు వచ్చే రోడ్డు మార్గాలలో ప్రధాన రోడ్డు అయిన పరిగి వద్ద మార్గంలో రోడ్డుపై వాగు పొంగి ప్రవహిస్తోంది. అదే మాదిరిగా ధరూర్ సమీపంలో కాగ్న వాగు, గోధుమ గూడా మీదుగా వెళ్లే మోమిన్ కలన్ తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు గోధుమ గూడా రైల్వే ఖానా వంతెన నుండి వాగు పొంగిపొర్లుతోంది.

అటు పక్క గ్రామమైన జైదుపల్లి వద్ద రైల్వే లైన్ కింద రోడ్డులో వాగు పొంగి ప్రవహిస్తున్నందున మైలారం, నాగారం, తారీగోపుల, నాసనపల్లి తదిరి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గెట్టిగింట్ పల్లి రైల్వే వంతెన వద్ద వాగు పొంగిపొర్లడంతో, గిరిగంటిపల్లి, మదనపల్లి, కొంపల్లి, తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement