Thursday, May 2, 2024

Vikarabad: జింకపై వీధి కుక్కల దాడి.. రక్షించిన స్థానికులు..

వికారాబాద్ టౌన్, ఆగస్టు 16(ప్రభన్యూస్): అనంతగిరి అనంతపద్మనాభ దేవాలయం సన్నిధిలోకి ఇవాళ జింకపిల్ల దేవాలయం ప్రహరీ గోడ దూకి వచ్చింది. కుక్కలు దాడి చేయడంతో పరుగెత్తుకుంటూ వచ్చిన జింక పిల్లను స్థానికులు కుక్కల దాడి నుంచి కాపాడారు. గుట్టలో వీధి కుక్కలు వెంబడించడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు జింక పిల్లను పశు వైద్యశాలకు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement