Saturday, May 18, 2024

భారత్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ‌త‌గ్గ‌ గొప్ప పోరాట యోధుడు భగత్ సింగ్

కుత్బుల్లాపూర్, :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చంద్రగిరినగర్ లో భగత్ సింగ్ వర్దంతి సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలోలో ప‌లువురు నేతలు భ‌గ‌వ‌త్ సింగ్ కి ఘనంగా నివాళ్ళు అర్పించారు.. ఈ కార్య‌క్ర‌మంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ బిజెపి నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొనగా స్థానిక నాయకులు భరత్ సింహ రెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్బంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. 1931, మార్చి 23న భగత్ సింగ్‌తోపాటు విప్లవకారులు సుఖ్ దేవ్, రాజ్ గురులను బ్రిటీషర్లు ఉరితీసారని వారి సేవలను గుర్తుచేశారు.. కార్యక్రమంలో సాయినాథ్ గాజుల రామారం డివిజన్ అధ్యక్షులు, నవీన్ గాజులరామారం యువ మోర్చా అధ్యక్షుడు, బుచ్చి రెడ్డి, రవి, యామ్, మధు, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement