Sunday, June 23, 2024

RR: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

షాద్ నగర్, మార్చి 26 (ప్రభ న్యూస్) : చేపల వేటకు వెళ్లి అనంత లోకాలకు చేరుకున్న దుర్ఘటన వెలిజర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని తాళ్ల చెరువులో చేపల వేటకు వెళ్లాడని స్థానికులు చెప్తున్నారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో గమనించిన కుటుంబీకులు అతని ఆచూకీ కోసం గాలించారు. మంగళవారం గ్రామంలోని తాళ్లచెరువులో గాలించగా మృతదేహం ఆచూకీ లభించింది. రమేష్ గా గుర్తించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గతంలో ఈ చోటే చాలామంది మృతి చెందారు..
గత కొంతకాలంగా గ్రామంలో ఉన్న తాళ్లచెరువు చాలా లోతట్టుగా ఉంది. గతంలో అనేక మంది మృత్యువాత పడ్డ ఘటనలు చోటుచేసుకున్నా ప్రభుత్వం చెరువు వద్దకు వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపట్టలేదు. దీంతో చేపల వేటకు నిత్యం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement