Tuesday, October 8, 2024

రంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ఓటింగ్ .. వికారాబాద్ లో ఓటు వేసిన ఎమ్మెల్యే ఆనంద్..ఇతర ప్రజాప్రతినిధులు.. అధికారులు

వికారాబాద్ నవంబర్ 30 ( ప్రభ న్యూస్): శాసనసభ ఎన్నికల్లో భాగంగా గురువారం జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేశారు వికారాబాద్ ఎమ్మెల్యే రక్షణ మెతుకు ఆనంద్ సతీమణి సవిత ఆనందో కలిసి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఓటు ను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సాధన పౌరుడిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు అనంతమైన మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలపై తనకు పూర్తి నమ్మకం ఉందని రెండోసారి దివిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

ఉదయం వేళలో బారులు తీరిన ఓటర్లు

వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ పూర్తయి ఏడు గంటలకు సరైన సమయానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని అక్కడక్కడ ఈవీఎంలు మురాయించి నప్పటికీ వాటి స్థానంలో నూతవి ఏర్పాటు చేసి పోలింగ్ ప్రారంభించినట్లు తెలిపారు
ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి ఏర్పాటు చేసినట్లు శాంతియుత వాతావరణము లో పోలింగ్ జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు ఓటర్ల ఉత్సహాన్ని పరిశీలిస్తే పెద్ద ఎత్తున పోలింగ్ నమోదయ్య అవకాశాలున్నాయని ఇందుకు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఫరూక్ నగర్ మడలంలోని తన స్వంత గ్రామం దూసకల్ గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నరు

- Advertisement -

క్యూలో నిలబడి ఓటు వేసిన సింహం అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

షాద్ నగర్ పట్టణంలోని 231 వ పొలింగ్ బూత్ లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి ఓటు వేశారు..

ఓటు వేసిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘంలో లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం వేళలో సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల నాయనా తన ఓటు వేసినట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement