Friday, February 23, 2024

Peddapalli: ప్రశాంతంగా పోలింగ్.. సీపీ రెమా రాజేశ్వరి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలియజేశారు. గురువారం పెద్దపెల్లి జిల్లా
మంథనిలో పోలింగ్ సరలిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు. ఎన్నికల నియామవళిని ఏ పార్టీ ఉల్లంఘించినా చట్టరీత్యా చర్యలు తప్పమన్నారు. సీపీ వెంట ఇన్స్పెక్టర్లు సతీష్, అశోక్ తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement