Friday, May 17, 2024

CM REVANTH REDDY : మాటిచ్చాడు.. ఉద్యోగ‌మిచ్చాడు..సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కింది. తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి రెండో సంత‌కం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. సీఎంగా ప్ర‌మాణం చేయ‌గానే ర‌జినీకి ఉద్యోగ నియామ‌క ప‌త్రంపై సంతాకం చేశారు.

నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌డ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ” అంటూ రేవంత్ ఆమెకు హామీనిచ్చారు. ఆ హామిని సీఎంగా ప్ర‌మాణం చేసిన అనంత‌రం రెండో సంత‌కం చేసి ఆమెకు ఉద్యోగం క‌ల్పించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement