Saturday, April 13, 2024

హైద‌రాబాద్ ని ముంచెత్తుతోన్న వ‌ర్షాలు-వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతోన్న ఆటోలు..కార్లు

హైద‌రాబాద్ లో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. అక్టోబర్ 12 బుధవారం రాత్రి వర్షం మళ్లీ దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా కుండపోత వాన పడింది. మునుపెన్నడూ లేనంత పిడుగుల మోతతో నగరం దద్దరిల్లింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. అపార్ట్ మెంట్లు సైతం నీటి ముంపులో చిక్కుకున్నాయి. దీంతో కార్లు ద్విచక్రవాహనాలు బొమ్మల్లా కొట్టుకుపోయాయి. భారీ వరద రహదారులపైకి రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్.. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్.. అమీర్ పేట‌.. పంజాగుట్ట ..బేగంపేట్ ..యూస‌ఫ్ గూడ‌.. షేక్ పేట్.. గచ్చిబౌలి.. హైటెక్ సిటీ ..ఆర్సీపురం.. రాజేంద్రనగర్.. బండ్లగూడ.. గొల్కొండ.. నార్సింగి పుప్పాలగూడ.. మైలార్ దేవులపల్లి ..మణికొండ.. గండిపేట.. షాద్ న‌గ‌ర్.. కూకట్ పల్లి ..నిజాంపేట.. బాచుపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల ద్విచక్ర వాహనాలు ఆటోలు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కార్లు ..ఆటోలు నీట మునిగి పాడయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రసూల్ పురాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి వరద నీరు చుట్టుముట్టింది. బోరబండ సహా అనేకచోట్ల ద్విచక్ర వాహనాలు ..ఆటోలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రో కింద భారీగా వరద నీరు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement