Saturday, May 18, 2024

Weather Update: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు..

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు (జూన్ 8) నుంచి రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్​ ఉందని తెలిపింది. బుధ, గురువారాల్లో (జూన్ 8, 9) ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో.. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శని, ఆదివారాల్లో (జూన్ 11, 12) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తూర్పు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ దాకా విస్తరించి ఉన్న ఉపరితల ధ్రోణి ఇవ్వాల ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంద్ర తీరం వరకు వ్యాపించి ఉంది. సముద్రం మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ఈ ధ్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఇవ్వాల ఉదయం 8.30 గం. సమయంలో నల్గొండలో అత్యల్పంగా 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్నిచోట్ల మబ్బుపట్టినట్లు ఉన్నప్పటికీ ఉక్కపోత, వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement