Sunday, May 5, 2024

Breaking: కొత్తగూడెంలో గాలివాన బీభత్సం.. రోడ్లమీద పడిపోయిన చెట్లు

కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. ఈదురు గాలుల తాకిడికి కొత్తగూడెం పట్టణంలో రోడ్లపైనే చెట్లు పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగింది. ఫ్లెక్సీలు కట్టిన హోర్డింగులు పడిపోయాయి. విద్యుత్​ వైర్లు రోడ్లమీద పడిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దాదాపు గంట సేపటి నుంచి వర్షం దంచికొడుతోంది. భారీగా వీస్తున్న గాలులకు పట్టణం అతలాకుతమైంది. ఒక దశలో రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు గాలివేటుకు కొట్టుకుపోయేలా కనిపించాయి. రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement