Thursday, May 23, 2024

TS : హైద‌రాబాద్‌కు వ‌ర్ష సూచ‌న‌… తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు…

హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు తెలిపింది. రోజు రోజుకు ఎండ‌లు మండిపోతుండ‌డంతో జ‌నాలు వేడితో అల్లాడిపోయారు. 24 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

- Advertisement -

దీంతో నగరానికి ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఉద‌యం నుంచి వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో ఉష్ణాగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోయి, నగర వాతావరణం చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.6, కనిష్ఠం 24.9 డిగ్రీలు, గాలిలో తేమ 42 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement