Friday, April 26, 2024

Rahul Gandhi: వినూత్నంగా రాహుల్ గాంధీ ప్ర‌చారం…చిన్న ఉద్యోగుల‌తో మ‌మేకం…

హైద‌రాబాద్ – ఎన్నిక‌ల ప్ర‌చార చివ‌రి రోజున కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వినూత్నంగా ప్ర‌చారాన్ని చేప‌ట్టారు. ఇందులోభాగంగా నగరంలోని పలు ప్రజాసంఘాలతో రాహుల్ గాంధీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైద‌రాబాద్ లో జీహెచ్‌ఎంసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్‌లతో రాహుల్ సమావేశమై వారి ఇబ్బందులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

డెలివరీ బాయ్‌తో మాట్లాడుతూ.. వారి దినచర్య ఎలా ఉన్నాయి? ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అడిగి తెలుసుకున్నారు.. వారి సమస్యలను, ఇబ్బందులను శ్రద్ధగా విన్నారు. ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీ బాయ్స్ తమ సమస్యను పరిష్కరించాలని రాహుల్ గాంధీని కోరారు. ప్రమాదాలు జరిగినా, సరుకులు పోయినా డెలివరీ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లు, కంపెనీల మధ్య ఇరుక్కుపోతున్నామని, కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఈబాధలు తప్పడం లేదంటూ వాపోయారు.

ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అందించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ విషయంపై దృష్టి సారించి రాజస్థాన్‌లో చేసిన విధంగా సంక్షేమ చర్యలు చేపడతామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు తమకు పింఛన్‌ లేదని వాపోయారు. ఐదు గంటలలోగా థంబ్స్ అప్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిరంతరాయంగా స్వీపింగ్ చేయడం వల్ల ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తోందని చెప్పాడు. ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీ శ్రద్ధగా విన్నారు. చిన్న ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని రాహుల్ వారికి హామీ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement