Saturday, July 27, 2024

ప్రభుత్వాన్ని దింపాలని రంకెలేస్తే దిగిపోతుందా..మంత్రి పువ్వాడ

అశ్వరావుపేట : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని రంకెలేస్తే మీకు భయపడి ప్రభుత్వం దిగిపొద్దా అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విప‌క్షాల‌ను సూటిగా ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. తొలుత అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలోని పెద్దచెరువు కట్టపై గల అభయాంజనేయ స్వామి వారిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. జమ్మిగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన RTA సబ్ యూనిట్ కార్యాలయం ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో పటిష్ట ప్రణాళికతో పని చేస్తుందని, అభివృధ్ధి, సంక్షేమం ను సమన్వయంతో సమానంగా చేసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని క్షేత్ర స్థాయిలో అమలు అవుతాఉంటే మీకు కనిపించకపోవడం విచారకరమని, పైగా వాటిపై స్పష్టమైన అవగాహన లేకుండా అవాక్కులు చవాక్కులు పేలడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ను నాశనం చేయలని కొందరు బయలుదేరారని, మీరు కంటున్న కలలు ఎప్పటికీ పగటి కలలుగానే గిలిపోతాయని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఅర్ శ్రీరామరక్ష అని అన్నారు.
రైతుల కోసమే సీతారామ సాగర్ ప్రాజెక్ట్ ను కడుతున్నారని, ఆయా పనులు నిర్విరామంగా కొనసాగుతున్నారని, తగిన సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసి గోదావరి జలాలను రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్ట్ కోసం మీకు రందిపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కష్టాలు పడుతున్నారు అని మాట్లాడుతున్న నీవు మొన్నటి వరకు ఇదే ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నపుడు ఎందుకు మాట్లాడలేదని, ప్రజల కష్టాలు పడుతున్నారు అని నేడు కొత్త పలుకులు అనుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

నువ్వు పదవిలో ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసింది ఏమి లేదని, తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. పార్టీ నీకు కల్పించిన అన్ని అవకాశాలను దుర్వినియోగం చేసి స్వలాభం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నావని ద్వజమెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చేసిన ప్రజాప్రతినిధుల జాబితాలో నీ పేరు లేదని, జిల్లాను నువ్వేదో తీర్చిదిద్దినట్లు ఉపన్యాసాలు దంచితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఇక నైనా మీ పరిధిలో మీరు ఉండటం మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అశ్వరావుపేట ముఖ ద్వారంగా ఉన్నందున దీనికి సముచిత స్థానం కల్పిస్తామని, రానున్న 4నెలల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టి వెలుగు జిలుగులతో సుందరీకరిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement