Thursday, October 10, 2024

Psycho Killer – మ‌హిళ‌ల కిడ్నాప్…ఆపై దారుణ హ‌త్య – సైకో కిల్ల‌ర్ అరెస్ట్

వికారాబాద్ జిల్లాలో మ‌హిళ‌ల కిడ్నాప్ ,హ‌త్య‌ల‌తో వ‌ణికిస్తున్న సైకో కిల్ల‌ర్ ఎట్టకేల‌కు పోలీసుల‌కు చిక్కాడు… తాండూర్‌లో ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్‌ చేసి వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్‌ను కిష్టప్ప పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల‌లోకి వెళితే రెండు రోజుల క్రితం అడ్డా మీద ఉన్న ఓ మహిళను పని కల్పిస్తానని చెప్పి తీసుకెళ్లి సైకో హత్య చేశాడు. మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీసీ ఫుటేజీ పరిశీలించగా.. చివరగా కిష్టప్ప మహిళతో మాట్లాడి ఆమెను తీసుకువెళ్లినట్లుగా గుర్తించా రు. దీంతో కిష్టప్పను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను చంపి మూట గట్టి పడేసినట్లు సైకో కిష్టప్ప విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉపాధి పేరుతో ఇప్పటివరకు ఆరుగురు మహిళలను హత్య చేసినట్లు సైకో కిష్టప్ప వెల్లడించాడు. ప్రస్తుతం సైకో కిష్టప్ప తాండూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అత‌డి నుంచి మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement