Thursday, October 3, 2024

TS : ప్రజా రంజక పాలనను అందిస్తాం… మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని ప్రజా రంజక పాలనను అందించే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదని ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దినసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో నిర్వహించిన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

- Advertisement -

ముందుగా నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగయ్య, వైస్ చైర్మన్ ఆడియో వసంత్ నాయక్ పాలకవర్గానికి జిల్లా మార్కెట్ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని రకాల హామీలను కచ్చితంగా అమలు చేస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఓర్వలేక నిందారోపణలు చేయడం సబబు కాదని అన్నారు. ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం జరిగిందని 18 కోట్ల 50 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాన్ని చేశారని అన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రారంభించామని వినియోగదారులకు జీరో బిల్లు వస్తుందని అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ను అలాగే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున అందజేస్తామని అన్నారు.

అలాగే మిగిలిన గ్యారెంటీస్ పథకాలను త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని దానికి ప్రతినెలా 70 వేల కోట్లు వడ్డీ తీరుస్తున్నామని తెలిపారు. ధరణి పోర్ట్ లో సమస్యలు ఉన్నాయని త్వరలో ప్రక్షాళన జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంపద పెంచుతుందని పేదలకు పంచుతుందని అన్నారు.బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, కుప్టి,ప్రణహిత ఎత్తిపోతల పథకం, నూతన సోనాల మండల ఏర్పాటు గురించి క్యాబినెట్లో చర్చిస్తానని తెలిపారు. రాబోవు ఎంపీ ఎలక్షన్లలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సీటును కైవసం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ సత్తు మల్లేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి, జెడ్పిటిసి నరసయ్య, మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య వైస్ చైర్మన్ ఆడే వసంత్ నాయక్,అధికార ప్రతినిధి పసుల చంటి అన్ని మండలాల ఎస్సీ బీసీ ఎస్టీ సెల్ నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజలు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement