Monday, October 14, 2024

TS : కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ జె.చంద్రశేఖర్ అయ్యర్ సారధ్యంలో అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

ఇందులో యు.సి. విద్యార్థి, ఆర్.పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా నియమించింది. ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) అమితాబ్ మీనా ఈ కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ నాలుగు నెలలో తన నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement