Saturday, April 13, 2024

TS: అన్న చెల్లెల మ‌ధ్య ఆస్తీ త‌గాదా… తొబుట్టువుపై గొడ్డ‌లితో దాడి

అన్న చెల్లెల మ‌ధ్య ఆస్తీ త‌గాదాతో తొబుట్టువుపై గొడ్డ‌లితో దాడికి పాల్ప‌డ్డాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోనిలక్ష్మీదేవి పేటలో ఆస్తి తగాదా విషయంలో గత కొద్ది రోజులుగా అన్న చెల్లెల మ‌ధ్య వివాదం కొన‌సాగుతుంది.

ఈ క్రమంలో ఉద‌యం చెల్లె పొన్నం సారక్క పై అన్న సమ్మయ్య గొడ్డలితోదాడి చేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఘ‌ట‌న సమాచారం అందుకున్న వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు సంఘటన స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలోకి చేరుకున్న సారక్కను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement