Thursday, April 25, 2024

వింట‌ర్ లోనూ ప‌వ‌ర్ డిమాండ్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విద్యుత్‌ విని యో గం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. చలికాంలోనూ విని యోగదారులు విద్యుత్‌ను ఎక్కువగానే వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడి.. ప్రాజెక్టులు నిండటం, భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం పెరగడంతో విద్యుత్‌ విని యాగం కూడా పెరుగుతోంది. అంతే కాకుంగా పట్టణీకరణ , గృహ సముదాయంతో పాటు పారిశ్రామీకరణ పెరగడం వల్ల కూడా విద్యుత్‌ వినియోగం నిత్యం పెరుగుతూ వస్తోందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరి కంటే ఈ ఏడాది జనవరి రెండో వారంలో గరిష్ట డిమా ండ్‌ 9 వేల మెగావాట్లు ఉంటే.. ఇప్పుడు ఏకంగా 4 వేల మెగా వాట్లు పెరిగి 13392 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ వినియోగం నమోదయింది. అంటే 230 మిలియన్‌ యూనిట్లకు పైగానే విద్యుత్‌ వాడం పెరిగింది. కాగా, గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ 13056 మెగావాట్ల గరిష్ట డిమా ండ్‌ నమోదు కాగా, ఒక రోజు వ్యవధిలోనే శుక్రవారం ఉద యం వరకు అదనంగా 236 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం పెరిగింది. దీంతో రోజు రోజుకు వినియోగదారులు విద్యుత్‌ వాడాకం ఎక్కువగానే పెరుగుతోందని సంబంధిత అధికా రులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణి పరి ధిలో కంటే దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ ( ఎస్సీడీసీఎల్‌ ) పరిధిలో విద్యుత్‌ వినియోగం ఎక్కువుగా నమోదవుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 11:38 గంటల వరకు 13,392 మెగావాట్ల విద్యుత్‌ ఖర్చు అయితే.. ఎస్పీడీ సీ ఎల్‌ పరిధిలో 8457 మెగావాట్ల విద్యుత్‌ వాడకం జరిగింది. గతేడాది జనవరిలో 6153 మెగావాట్ల విద్యుత్‌ ఖర్చు అయి ంది. ఒక దక్షిణ తెలంగాణ పరిధిలోని డిస్కంలోనే గతేడాది కంటే అదనంగా 2104 మెగావాట్ల వినియోగం పెరిగింది. విద్యుత్‌ కనెక్షన్లు పెరగడంతోనే.. విద్యుత్‌ వాడకం కూడా పెరు గుతూ వస్తోంది. ఉత్తర తెలంగాణ ( ఎన్పీడీసీఎల్‌) డిస్కం పరి ధిలో విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ శుక్రవారం ఉదయం 10:28 గంటల వరకు 4688 మెగావాట్ల విద్యుత్‌ వాడకం నమో దైంది. ఇదే సమయంలో గతేడాది విద్యత్‌ గరిష్ట వాడకం 2614 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగమైంది. అంటే గతే డాది జనవరి కంటే ఇప్పుడు అదనంగా 2074 మెగావాట్ల వినియోగం పెరిగింది. ఒక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ 1800 మెగావాట్లకు పైగా విద్యుత్‌ ఖర్చు అవుతోంది.

పెరిగిన పర్‌ క్యాపిటా విద్యుత్‌ ఖర్చు..
రాష్ట్ర విభజనకు ముందు ఒక పర్‌ క్యాపిటా విద్యుత్‌ వినియోగం 1196 యూనిట్స్‌ ఉంటే.. 2021 వరకు 2012 యూనిట్స్‌కు పెరిగింది. అది 2022 డిసెంబర్‌ 26 వరకు పర్‌ క్యాపిటా విద్యుత్‌ ఖర్చు 2126 యూనిట్‌ నమోదైంది. అంటే ఒక ఏడాదిలో పర్‌ క్యాపిటా విద్యుత్‌ వినియోగం అదనంగా 114 యూనిట్స్‌ విద్యుత్‌ వినియోగం పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో మొత్తం పర్‌ క్యాపిటా విద్యుత్‌ 930 యూనిట్ల వరకు పెరిగింది.
26.44 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు..
రాష్ట్ర వ్యాప్తంగా విద్యత్‌ వ్యవసాయ కనెక్షన్లు 26 లక్షల 44 వేల 254 ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు 18 లక్షల 59 వేల 527 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు అదనంగా 9 లక్షల 3 వేల 188 విద్యుత్‌ కనెక్షన్లు పెరిగాయి. రాష్ట్రంలో యాసింగి పంటకు సంబంధించి డిసెంబర్‌ చివరి వారంలోనే వరినాట్లు జోరందుకున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం సం క్రాంతి తర్వాత నాట్లు వేయడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి రాష్ట్రంలో చాల చోట్ల రైతులు ముందుస్తుగా వరి నాట్లు వేశారు. ఈ వారం పది రోజుల్లో మిగిలిన వారినాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి.
గతేడాది యాసంగి సమయంలో ప్రభుత్వం వరి సాగును నియంత్రించింది. ధాన్యం కొను గోళ్లపై సందిగ్ధత కారణంగా.. రైతులు వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలను వేయాలని ప్రభుత్వం సూచించిన విష యం తెలిసిందే. దీంతో గతేడాది వరిసాగు రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఎకరాల్లోనే రైతులు వరి సాగు చేశారు. ఈ సారి అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఈ సారి 50 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఈ నేప థ్యంలో రానున్న రోజుల్లోనూ విద్యుత్‌ డిమాండ్‌ మరింతగా పెరగనుంది. 15 వేల మెగావాట్లకు పైడా డిమాండ్‌ వచ్చిన విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పంపిణి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement