Wednesday, May 1, 2024

బండిపై విరుచుకుప‌డ్డ పొన్నం …క‌రీంన‌గ‌ర్ కు ఏం చేశార‌ని నిల‌దీత‌..

క‌రీంన‌గ‌ర్ – లిక్క‌ర్ స్కామ్ లో కవిత ని‌ ఎందుకు‌ అరెస్టు చేయలేదని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి‌సంజయ్ ని ప్ర‌శ్నించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,.. కరీంనగర్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ బండి‌సంజయ్ కి పిచ్చిలేచి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బిజేపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని అంటూ బిఆర్ఎస్ పార్టీ బిజేపి పార్టీని లేపే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.. హుజుర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో బిజేపి కి కనీసం డిపాజిట్ రాలేదని గుర్తు చేశారు. ఇక ఇటీవ‌ల గెలుపుతో బండి సంజయ్ తన బలం అనుకొని‌ తోలుబొమ్మలాగా మారారని విమ‌ర్శించారు.

ఒక జోకర్ లాగా బండి మారారని అన్నారు. పార్లమెంటు పరిధిలో ఎన్నో సమస్యలు‌ ఉన్న కనీసం పట్టించుకున్నారా అని ఎంపిని నిల‌దీశారు. టిపిన్ బైటక్ కాదు చెంబులు పట్టుకొని‌ బాత్రూం లో‌ కూర్చోని మాట్లాడుకొండని ఎద్దేవా చేశారు. అస‌లు బిజేపి శాసనసభ్యులతో బండి సంజయ్ కి‌ సత్సంబంధాలు లేవన్నారు. బండి‌సంజయ్, గంగుల కమలాకర్ ఇద్దరూ స్నేహపూర్వకంగా మెలుగుతున్నారని వాఖ్యానించారు. బండి‌సంజయ్, వినోద్ కుమార్ కరీంనగర్ లోక్‌సభ ఎంపిలుగా ఉండి ఏం చేశార‌ని అన్నారు.. కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి పై చర్చకి ఇద్దరూ రావాలని పొన్నం సవాల్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement