Monday, May 6, 2024

Withdraw – స‌మ్మె ప్ర‌తిపాద‌న‌ను విర‌మించండి… లారీ డ్రైవ‌ర్ల‌కు మంత్రి పొన్నం విన‌తి …

హైదరాబాద్ : లారీ డ్రైవర్లు రేప‌టి నుంచి చేయ‌త‌ల‌పెట్టిన సమ్మెను విరమించుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలోని 106(2) హిట్ అండ్ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ని ఇప్పట్లో అమలు చేయబోమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సెక్రటరీలు ప్రకటించారు. ఒకవేళ భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్స్, లారీ ఓనర్స్‌ పిలిచి మాట్లాడతామని, ఆ తరువాతనే అమలు చేస్తామని కేంద్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్ భల్ల ఇప్పటికే హామీ ఇచ్చిని విషయాన్ని గుర్తు చేశారు.

కానీ కొన్ని గుర్తింపు లేని సంఘాలు రేపటి నుంచి లారీల సమ్మె చేయాలని భావిస్తున్నారు. సమ్మెని గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సరైంది కాదని, కొత్త చట్టం రాష్ట్ర పరిధిలోనిది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ఆయన తెలిపారు. లారీ డ్రైవర్లు సమ్మె పై పునరలోచించాలన్నారు. లారీ డ్రైవర్లు సమ్మెలోకి వెళ్తే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వెంటనే సమ్మె పై పునరలోచించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement