Tuesday, February 13, 2024

Congress – 9న కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం త‌ధ్యం – పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

నేల‌కొండ‌ప‌ల్లి – ఈ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుని ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం త‌ధ్య‌మ‌ని అన్నారు పాలేరు కాంగ్రెస్ అభ్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస రెడ్డి . నేలకొండపల్లి మండలం మజ్జుగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. దోపిడీని ప్రశ్నిస్తున్న తనను, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ డబ్బు సంచులను పంపిస్తున్నారని ఆరోపించారు.


తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ కలలను కల్లలు చేశారని అన్నారు. దొరను గడీలోనే బంధించాల్సిన సమయం ఆసన్నమయిందని, కేసీఆర్ కు రాజకీయ సమాధి కట్టాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement