Sunday, April 28, 2024

Poll day – ఆవుపై పోలింగ్ కేంద్రానికి…..

తెలంగాణ ఎన్నికల వేళ కొన్ని చోట్ల చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటికి సంబంధిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వ్యక్తి విచిత్రంగా ఆవు మీద కూర్చుని ఓటు వేసేందుకు వచ్చారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే తానూరు మండలం మహలింగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నారు. కాగా నేడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన సొంత గ్రామానికి ఆవుపై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు.దీనిని వీడియో తీసి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement