Friday, May 3, 2024

TS : భార‌త‌మాత‌కు పూజారిని… పీఎం మోదీ

తనకు ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపంలో కన్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.జగిత్యాలలో సోమవారం నాడు జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, .ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల పండగ మొదలైందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య ఉత్సవానికి తొలి అడుగుప‌డింద‌న్నారు.. తెలంగాణలో బీజేపీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతిస్తార‌నే ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని అంటూ వికాసం కోసం తెలంగాణ ప్ర‌జ‌లు బీజేపీకి ఓటు వేయాలని కోరారు.

కాళేశ్వ‌రంలో అవినీతి…లిక్క‌ర్ స్కామ్ లో క‌విత
బిఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లో భారీ అవినీతికి పాల్పడిందంటూ ఆరోపించారు.. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కెసిఆర్ కుమార్తె క‌విత కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్ లోఆమెకు భాగ‌స్వామ్యం ఉందంటూ చెప్పారు.. అవినీతికి ఎవ‌రు పాల్ప‌డినా స‌హించ‌బోన‌ని, ఎంత‌టి పెద్ద‌వారైన జైలుకు పంపుతాన‌ని తేల్చి చెప్పారు.. తెలంగాణ కలలను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. కొత్తగా ఇక్కడ అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇక్కడ దోచి ఢిల్లీ పార్టీ కి పంపుతుందని ధ్వ‌జ‌మెత్తారు.. తెలంగాణలో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ రెండు ఒక్కటే అన్నారు.

400 సీట్ల‌లో గెలుపు త‌ధ్యం
జూన్4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయే 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. విపక్షాల ఇండియా కూటమిలో ఐక్యత లేదన్నారు. కూటమిలో పార్టీలన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ముంబయిలో జరిగిన రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్రను ప్రస్తావిస్తూ విపక్షాల అనైక్యత ఆసభలో కనిపించిందన్నారు. రాహుల్‌గాంధీ శక్తిపై తమ పోరాటం అన్నారని.. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తేలిపోతుందన్నారు. శక్తిని నాశనం చేయాలని విపక్ష కూటమి భావిస్తోందన్నారు.

శ‌క్తిని ఎవ‌రైనా నాశ‌నం చేయ‌గ‌ల‌రా..
శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా అని మోదీ ప్రశ్నించారు.శక్తి వినాశనం చేసేవాళ్లకు.. శక్తి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతుందని పేర్కొన్నారు. శక్తి రూపంలో మహిళలు తనను ఆశీర్వదించేందుకు వచ్చార‌ని, ఇది తన భాగ్యమని తెలిపారు. శ‌క్తి స్వరూపులైన ప్రతి మాత, సోదరి, కుమార్తెలకు తాను పూజారినని చెప్పారు.శక్తి స్వరూపులైన మహిళల రక్షణ కోసం తాను ప్రాణాలు అర్పించేందుకు సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. తాను భారతమాత పూజారిన‌ని పేర్కొన్నారు.
చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడ శివశక్తి అని పేరు పెట్టుకున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. శక్తిని నాశనం చేసేవారికి, శక్తిని పూజించేవారికి మధ్య పోరాటం సాగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement