Sunday, June 23, 2024

Palvancha – పట్టపగ‌లు యువ‌కుడి దారుణ హత్య..

పాల్వంచ ప్రభన్యూస్ – పట్టపగలే ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయ నవీన్ (25) అనే యువకుడు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇవాళ ఉదయం తన తల్లిదండ్రులను పొలం వద్ద వదిలి ఆటోపై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే హెల్మెట్ ధరించిన ఇద్దరు ఆగంతకులు బైక్పై వచ్చి నవీన్పై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.

కాగా, రోడ్డుపై వెళ్తున్న వారు, ఆ ప్రాంతంలో పొలం పనులు చేస్తున్న వారు హత్య జరుగుతుండగా చూసి పోలీసుల‌కు సమాచారం ఇచ్చారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

కాగా, హత్యకు అక్రమ సంబంధమే కారణం అనే అనుమానాలు వ్యక్తం మవుతున్నాయి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement