Friday, May 3, 2024

చుక్కల మందుకు చక్కని స్పందన

పెద్దపల్లి జిల్లాలో చుక్కల మందుకు చక్కని స్పందన లభిస్తోంది. ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు తల్లిదండ్రులు బారులుతీరారు. 0 నుండి ఐదు సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లాలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు నాలుగువందల కేంద్రాలను ఏర్పాటు చేశారు. 62,520 మందికి పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈనెల 28 నుండి మూడు రోజులపాటు 24 బృందాలు ఇంటింటికి తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement