Friday, April 26, 2024

Drunk and drive: సైబరాబాద్ లో 32,818 కేసులు!

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 32,818 కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినవారిలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులే ఉన్నారు. మొత్తం కేసుల్లో 25,614 మంది బైకర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. 5,947 కార్లు, 1,055 ఆటో డ్రైవర్లు, 202 భారీ వాహనాల డ్రైవర్లపై కేసులు నమోదు అయ్యాయి.

తనిఖీల్లో ఎక్కువగా 35 ఏళ్ల లోపు వారే దొరికిపోతున్నారు. ఈ ఏడాది కాలంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే మద్యం తాగి నడపడం వల్ల 210 ప్రమాదాలు జరిగాయి. ఫలితంగా 232 మంది మరణించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల 30.7 శాతం ప్రమాదాలు జరిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement