Thursday, May 26, 2022

ఏఓసీ సెంటర్‌లో ఓపెన్‌ వర్సిటీ లెర్నింగ్‌ సెంటర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ స్వతంత్ర అభ్యాసన సహాయ కేంద్రాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ప్రారంభించారు. విద్యాభివృద్ధి దిశగా అడుగులు వేస్తే సైనికుల విద్యార్హత పెరగడమే కాకుండా, పదవీ విరమణ తర్వాత ఇతర అవకాశాలకు ఈ విద్యార్హతనేది అర్హులుగా, సమర్థులుగా మారుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్‌ జనరల్‌ రంజీత్‌ సింగ్‌ మన్రాల్‌, అజీత్‌ అశోక్‌ దేశ్‌పాండే, వర్సిటీ వీసీ సీతారామారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement