Sunday, April 28, 2024

ఓపెన్ ఇంటర్ ప్రశ్నాపత్రం తారుమారు – ఎకనామిక్స్ పరీక్ష రద్దు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారిం ది. పేపర్లు లీకేజీ కావడం పేపర్లు తారుమారు కావడం లాంటి సంఘటనలు జరుగుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా గా ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలో గందరగోళం నెలకొంది. అభ్యర్థులకు తెలుగు మీడి యంకు బదులు ఇంగ్లీష్‌ మీడియం ఎకనామిక్స్‌ పేపర్‌ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఈ విష యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పరీ క్షను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు జరు గుతున్నాయి. మంగళవారంనాడు తెలుగు మీడియం ఎకనామిక్స్‌ చివరి పరీక్ష జరగాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకు న్నారు. అయితే నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జగి త్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలోని పరీక్ష హాల్‌తో పాటు మరికొన్ని చోట్ల ప్రశ్న పత్రం కోసం దాదాపు మూడు గంటల పాటు అభ్యర్థులు ఎదురు చూశారు. తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ మీడియం ప్రశ్నపత్రం రావడంతో అభ్యర్థులను అధికారులు బయటకు పంపించారు. దీంతో ఎకనామిక్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చారు. పరీక్ష సరిగా నిర్వహణ చేయకపోవడంపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశా రు. రద్దయిన పరీక్షను ఈ నెల 13న నిర్వహించ ను న్నట్లు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ డైరెక్టర్‌ ఈమే రకు ప్రకటన విడుదల చేశారు. పరీక్షల నిర్వహణలో జాగ్ర త్తలు పాటించకపోవడంతోనే ఇలాంటి సంఘ టనలు పునరావృతం అవుతున్నా యని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. గతంలో ఇంటర్‌ వార్షిక పరీక్షల్లోనూ పేపర్లు తారుమారు అయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement