Wednesday, May 8, 2024

ఎండీ హోమియో, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి 15,16వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. పీజీ హోమియో కోర్సులో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వాాం భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడతల కౌన్సెలింగ్‌లకు సీట్లకేటాయింపులు జరపనున్నారు.

అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లోఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి 16న సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ ఆప్ష న్లు నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement