Thursday, May 9, 2024

Shamshabad Air Port – ఈసారి స్పీక‌ర్ల‌లో దాచి బంగారం అక్ర‌మ ర‌వాణా…

శంషాబాద్ – విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దాచి తీసుకొస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు. బంగారాన్ని స్ప్రే రూపంలోకి మార్చి, చీరపై చల్లి తీసుకొస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. తాజాగా స్పీకర్లు, ఇస్త్రీ పెట్టెలో భారీ ఎత్తున బంగారాన్ని దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.కోటికి పైనేనని మీడియాకు వెల్లడించారు.

జెడ్డా నుంచి శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ విమానంలో బంగారం అక్రమ రవాణా జరుగుతోందని అధికారులకు అప్పటికే సమాచారం అందింది. దీంతో ప్రయాణికులను మరింత నిశితంగా పరిశీలించగా ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించిందని అధికారులు చెప్పారు. వారు తీసుకొచ్చిన లగేజీని పరిశీలించగా.. ఐదు స్పీకర్లు, ఓ ఇస్త్రీ పెట్టెలో దాచిన 8 కిలోల బంగారం బయటపడింది. మార్కెట్లో దీని విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement