Friday, May 3, 2024

NZB: ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు.. బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్ రూరల్, ఆగస్టు 24, ప్రభ న్యూస్ : ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు, అలవెన్స్ లు అందుతాయని ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చాలంటే క్షేత్ర స్థాయిలో బాధ్యత కలిగిన అధికారి ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం 2019లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్‌ వేసి నియామకం చేపట్టింది. ఇందులో భాగంగానే గురువారం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 6 మండలాలకు చెందిన జేపీఎస్ అలాట్‌ మెంట్‌ ఆర్డర్స్‌ పత్రాలను రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఉద్యోగస్తులకు పంపిణీ చేశారు. డిచ్ పల్లి మండలానికి చెందిన 27మందికి, అదేవిధంగా ఇందలవాయి మండలానికి 9మందికి, జక్రన్ పల్లి మండలానికి సంబంధించిన 15 మందికి, మోపాల్ మండలానికి సంబంధించిన తొమ్మిది మందికి, నిజామాబాద్ రూరల్ మండలానికి చెందిన 8మందికి, అలాగే సిరికొండ మండలానికి పదిమందికి జేపీఎస్ అలాట్‌ మెంట్‌ ఆర్డర్స్‌ పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పంచాయతీ కార్యదర్శులు చాలా కష్టపడి గ్రామాన్ని ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా చాలా ఉంటుందన్నారు. మీరందరూ చాలా కష్టపడాలని ఉద్యోగులకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లో జేపీఎస్ ఉద్యోగులకు ఇచ్చే సాలరీ, వేరే రాష్ట్రాల్లో లేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 5వేల రూపాయలు పంచాయతీ సెక్రెటరీలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మీ కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, కావున మీరందరూ చాలా కష్టపడి గ్రామాలను ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. వీరందరిని ప్రొబేషనరీ పీరియడ్‌ పేరుతో తీసుకొని తొలుత వారికి రూ.15వేల వేతనంతో మూడండ్లే ప్రొబేషనరీ పీరియడ్‌ను పెట్టి తర్వాత 2022 ఏప్రిల్‌ 12న రూ.29 వేలు చేసిందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నాలుగేండ్ల సర్వీస్‌ పూర్తి అయిన జేపీఎస్‌లను గ్రేడ్‌-4 కార్యదర్శులుగా రెగ్యులర్‌ చేస్తూ పదోన్నతి కల్పిస్తుందన్నారు. పల్లె ప్రగతిలో వారి పనితీరును లెక్కించి 70శాతం మార్కులు సాధించిన వారికి నేడు తొలివిడుతగా అలాట్‌ మెంట్‌ ఆర్డర్స్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్, డిపిఓ జయసుధ, డి ఎల్ పి ఓ నాగరాజు, వివిధ మండలాల నుంచి వచ్చిన గ్రామ పంచాయతీ సెక్రెటరీలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement